Wednesday, 4 May 2011

నెమలికన్ను-మురళి

బాల్యాన్ని అరిటాకులో వడ్డించినా, సినిమాలు ఆసాంతం వినిపించినా, సుమన్ బాబును ఆటపట్టించినా ఆ టపాల తీరే వేరు.ఆయన బ్లాగులో ఓ టపాకి వ్యాఖ్యగా నేనే రాసినట్టు - మురళీ గారి టపాలు అమ్మ వేసే పకోడీల్లా ఉంటాయి. కొంచెం ఉల్లిపాయ ముక్కలూ, కొచెం పిండి, కాస్త ఉప్పూ, కాస్త కారం, ఎక్కువ నూనె అంతే వేడిగా చిన్న చిన్న పకోడీలు వానలో పొడిగా కూచుని తిన్నట్టు అనుభూతి ఆ టపాలు చదువుకుంటూంటే.

          ఎన్నోసార్లు అనుకున్నాను మురళీ గారు నాకు ఏ క్లాస్మేట్ గానో పరిచయమైతే బాగుండేదని. గోదారి, వంశీ, సాగరసంగమం, వంశీ, విశ్వనాథ్, బాలచందర్, ఈనాడులో పడిన మనసులో వాన కథ(ఇది మరీ విచిత్రం), చాలా పాటలూ, పుస్తకాలూ అలా ఎన్నో అభిరుచులు ఒకటే నాకూ మరళికీ. అంతవరకూ ఎందుకు, ఆయన పరిచయం చేసిన పుస్తకాలు నేనెంతగానో ముచ్చటపడి చదివినవే అన్నీనూ. మేము క్లాస్మేట్స్ అయివుంటే ఏ నైటవుట్లోనో, పరిక్షలైపోయిన మధ్యహ్నమో ఒకే పుస్తకం మార్చి మార్చి చదువుకునేవాళ్లమేమో, ఒకే సినిమాని మార్చి మార్చి చూసేవాళ్లమేమో. చివరికి యుగాంతం గురించి కూడా ఒకేలా ఆలోచించడమేంటో(http://nemalikannu.blogspot.com/2011/01/blog-post_04.html)  
ప్రపంచవ్యాప్తంగా ఒకేలాంటి వాళ్లు 7గురు ఉంటారంటారు. ఆ స్టేట్మెంటుకీ ఈ విషయానికీ ఏమైనా సంబంధం ఉందో ఏమో. చూశారా మురళీగారుతో మొదలై మురళీకి వచ్చేశాను. ఏదో గౌరవానికి గారు కానీ నాకు మాత్రం మురళీనే. ఇంతా చేసి సదరు మురళీతో మెయిలు పరిచయం కూడా లేదండీ.
     నెమలికన్ను బ్లాగు గురించీ, మురళీ గార్ని గురించీ చెబుదామని మొదలై నా పిడకలవేటలో పడిపోయా. 
     మళ్ళీ రాతల్లో ఉండేవి రెండే రెండు అంశాలు ముఖ్యమైనవి. మొదటిది ఆయన రసఙ్ఞత. ఈ రోజుల్లో కరువైపోయినది  రసఙ్ఞత, అరుదైపోయినవాడు రసఙ్ఞుడు. క్రికెట్, సినిమా, టీవీ తప్ప మరొక అభిరుచి లేని రోజుల్లో  వైవిధ్యభరితమైన అభిరుచులు ఆయన బ్లాగుకు విస్తృతమైన వస్తువుని ఇచ్చాయి. రెండోది- మార్దవం. ఏది రాసినా ఒక మార్దవమైన శైలి తప్ప కటువుగా చెప్పేధోరణి కనిపించదు. ఈ విషయం కటువుగా ఎలా చెప్తాం అన్నట్టుంటాయి ఆ టపాలో విషయాలు. ఆసలు మురళీ అన్న పేరే మార్దవం గా ఉంటుంది ఇక బ్లాగుపేరు నెమలికన్ను సంగతి వేరే చెప్పాలా?
    ఈ బ్లాగు గురించి తలచుకోగానే ఓ పాట గుర్తొస్తుంది-"మేడంటే మేడా కాదు. గూడంటే గూడూ కాదు, పదిలం గా అల్లుకున్న పొదరిల్లు మాది.. పొదరిల్లు మాది". ఆ పొదరింట్లో అడుగుపెడితే మీ బుద్ధికి పదును పెట్టి అలిసిపోయే పని ఉండదు. మనసు సేదదీరుతుంది హాయిగా. టపా అన్న పదం కూడా ఆ రచనలకు ఎబ్బెట్టుగా తోస్తుంది. ఎందుకంటే ట,ప రెండూ పరుషాలే. అందుకే అవి కొసరి కొసరి కూసే కోయిల కూతలు. కోరి కోరి తినే పకోడీలు.
ఆస్వాదించండి ఈ టపాలు క్షమించాలి పకోడీల్ని.
భావు"కతలు"
బాల్య ఙ్ఞాపకాలు
కథా పరిచయాలు
సినిమాలు 
పుస్తకాలు 
ఇలా ఎన్నో ఉన్నాయి ఇస్తూ పోతే అన్ని లింకులూ ఇవ్వాలి. కనుక నెమలికన్ను లోకి వెళ్లిరండి (అనాలి కాబట్టి అంటున్నానే కానీ వెళ్తే రావడం కష్టం)

5 comments:

  1. baagundandi .naaku baagaa nacchina blag idi.

    ReplyDelete
  2. nijamgaa nijamandoy..nemalikannu blog loki velte ika venakki raavadam vundadu. manalni manam marchipovadame.

    ReplyDelete
  3. i agree with ప్రణీత స్వాతి garu , naaku murali garitho mail parichayam undhi daniki anandapaduthunna and aayana blog ki elaga vachano teliyadhu kani nenu book mark chesina adhi kodhi upayoga pade vatilo nemalikannu blog okkati

    ReplyDelete